ఇంద్రనగర్ తండాలో ఎస్ఐఆర్ వెరిఫికేషన్ పూర్తి.
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రనగర్ తండాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన 160 నోటీసులకు సంబంధించి 100 శాతం వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది.
ఈ మేరకు గ్రామ సర్పంచ్ మలావత్ బాలు నాయక్ తెలిపారు. బీఎల్వోలు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గ్రామస్థులు తమ ఓటు హక్కుకు సంబంధించిన వివరాలను అందించి సహకరించినందుకు సర్పంచ్ బాలు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

























