దోమకొండ లో వీబి రాంజీ శిక్షణ కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
దోమకొండ: దోమకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో వీబి రాంజీ పథకంలోని వీబి పిపి అంశంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం అమలు విధానం, గ్రామస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు పాల్గొన్న వారికి అవగాహన కల్పించారు. వీబీపీపీకి సంబంధించిన అంశాలు, గ్రామస్థాయిలో చేపట్టాల్సిన పనులు, సంబంధిత శాఖల మధ్య సమన్వయం, అమలు విధానంపై అధికారులు వివరించారు.
ఈ శిక్షణకు దోమకొండ, బీబీపేట, భిక్నూర్ రాజంపేట మండలాలకు చెందిన సర్పంచులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, వివిధ లైన్ డిపార్ట్మెంట్ల అధికారులు, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు సమన్వయంతో కార్యక్రమాలను గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

























