రైతు – కూలీల నినాదాల అమరుల త్యాగాల పాటల మధ్య అఖిల భారత రైతు కూలీ సంఘం 4వ జాతీయ మహాసభలు ప్రారంభం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
రైతు కూలీల హక్కుల కోసం పోరాటానికి నూతన దిశానిర్దేశం చేసేలా అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ 4వ మహాసభలు ఖమ్మంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రైతు- కూలీల నినాదాలు, అమరవీరుల త్యాగాలను స్మరించే నినాదాలు, విప్లవ గేయాల మధ్య మహాసభల ప్రాంగణం మార్మోగింది.
మహాసభల ప్రారంభ సూచకంగా AIKMS జెండాను ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్యఆవిష్కరించారు.అనంతరం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ విప్లవ గేయాన్ని ఆలపించారు. రైతాంగ, కూలీ ఉద్యమాల కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.అనంతరం జరిగిన మహాసభకు జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకటరమణ అధ్యక్షత వహించారు. సభకు ఆహ్వాన సాంగ్ అధ్యక్షులు. డాక్టర్.ఎం.ఎఫ్ గోపీనాథ్ ఆహ్వానం పలికారు.ఆయన మాట్లాడుతూ దేశంలో రైతులు,వ్యవసాయ కార్మికులు, పేదలు ఎదుర్కొంటున్న దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా విశాల ఐక్యతను నిర్మించడం నేటి ప్రధాన కర్తవ్యమని అన్నారు. రైతు కూలీలు తమ హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
భూమి,ఉపాధి,కూలి, సామాజిక గౌరవం వంటి సమస్యలతో పాటు కుల అణచివేతకు వ్యతిరేకంగా కూడా రైతు కూలీల ఐక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఆయనవివరించారు.రైతు–కూలీలప్రాతినిధ్యం,అధికార సాధన కోసం పోరాడాలి. మహాసభలనుప్రారంభించిన ప్రొఫెసర్ మనోరంజన్ మహంతి.2021లో మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేలా చేసిన రైతాంగ ఉద్యమం భారత ప్రజా ఉద్యమాల చరిత్రలో ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది.అది ఒక్క చట్టాల ఉపసంహరణ మాత్రమే కాదు—ఐక్యంగా,దీర్ఘకాలం పోరాడితే పాలకులను వెనక్కి తగ్గించగలమనే విశ్వాసాన్ని రైతాంగంలో నింపింది.అయితే నేడు దేశంలో ఒక విరుద్ధ పరిస్థితి ఉంది. దేశానికి ఆహారాన్ని అందిస్తున్న రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు దేశ జనాభాలో అత్యధిక భాగంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ విధానాల్లోనూ, మీడియా చర్చల్లోనూ వారికి తగిన స్థానం కనిపించడం లేదు.అని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మించేది ఎవరు?
దేశానికి ఆహారం పండించేది ఎవరు? కానీ వారి గురించి మాట్లాడే వారు లేకుండా పోయారు నేడు పాలకులు వేగవంతమైన ఆర్థిక వృద్ధి, భారీ మౌలిక వసతులు, సాంకేతిక అభివృద్ధి, కార్పొరేట్ పెట్టుబడుల గురించిమాట్లాడుతున్నారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ అంటున్నారు.కానీ ఈ అభివృద్ధిలో సన్న చిన్న కారు రైతు ఎక్కడ ఉన్నాడు? వ్యవసాయ కూలీ ఎక్కడ ఉన్నాడు? భూమిలేని పేద ఎక్కడ ఉన్నాడు? దళితుడు, ఆదివాసీ, మహిళా కూలీ ఎక్కడ ఉన్నారు?
అభివృద్ధి అంటే కొద్దిమందికి సంపద పెరగడం కాదు.ప్రతి కుటుంబానికి భూమి, పని, ఆదాయం,విద్య,వైద్యం, గౌరవప్రదమైన జీవితం లభించడమే నిజమైన అభివృద్ధి అన్నారు.రైతు, కూలీల సమస్యలను కేవలం ఒకో డిమాండ్‌గా చూడటం సరిపోదు.కనీస మద్దతు ధర,భూమి,కూలి, ఉపాధి,నీరు,విత్తనాలు, రుణాలు—ఇవన్నీ ముఖ్యమైన సమస్యలే. కానీ వాటి వెనుక ఉన్న అసలు ప్రశ్నను మనం గుర్తించాలి.దేశాన్ని ఉత్పత్తి చేసే ప్రజలకు దేశ నిర్ణయాల్లో అధికారం కావాలనిపిలుపునిచ్చారు.ఉంది?మూడు ప్రధాన సమస్యలు
మొదటిది—కార్పొరేట్ అనుకూల అభివృద్ధి నమూనా.గనులు, భారీ ప్రాజెక్టులు,ఆనకట్టలు, పరిశ్రమల పేరుతో భూములుతీసుకోవడం,అడవులను ధ్వంసం చేయడం,ప్రజలను నిర్వాసితులను చేయడం కొనసాగుతోంది.
రెండవది—వర్గ,కుల, పితృస్వామ్య ఆధిపత్యం.
దళితులు,ఆదివాసీలు, మహిళలు,గ్రామీణ పేదలు అనేక రూపాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారు.సంక్షేమ పథకాలు అవసరమే అయినప్పటికీ, అవి ప్రజలకు హక్కులు, నిర్ణయాధికారం కల్పించే నిర్మాణాత్మక మార్పులకు ప్రత్యామ్నాయం కావు.
మూడవది—రైతు,కూలీ ఉద్యమాల్లో ఉన్న విభజనలు, ఐక్యతా లోపాలు.ఈ బలహీనతలను పాలక శక్తులు తమ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాయి.మరి మనం ఏం చేయాలి?మొదటగా గ్రామస్థాయిప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. పంచాయతీలు, పాఠశాలలు,ఆసుపత్రులు, తాగునీరు,ఉపాధి,స్థానిక అభివృద్ధి వంటి అంశాల్లో రైతు–కూలీలను క్రియాశీల భాగస్వాములుగామార్చాలి అన్నారు.వివిధప్రజాసంఘాలసందేశాలు.అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ 4వ మహాసభలు జయప్రదం కావాలని దేశంలోని వివిధ రైతు,కూలీ,ఆదివాసీ, మహిళా,విద్యార్థి సంఘాల నాయకులు అభినందన సందేశాలుతెలిపారు.తమిళనాడు రైతు విముక్తి సంఘం తరఫున కె. సెల్వరాజ్,మల్కన్‌గిరి జిల్లా ఆదివాసీ సంఘం తరఫున సలహాదారు విజయ ఉపాధ్యాయ,ఎ ఐ యు కె ఎస్ తరఫున కె. రంగయ్య, కిసాన్ ఏక్తా కేంద్రం తరఫున కామ్రేడ్ ప్రవీణ్ కుమార్, ఐఎ ఐ కె ఎం కె ఎస్ తరఫున కె. మోహన్‌రెడ్డి,ఐ ఫ్ టీ యు నుండి కె. శ్రీనివాస్, POW తరుపున జాతీయ కో-ఆర్డినేటర్ జి.ఝాన్సీ పిడిఎస్ యు నుండి జాతీయ కో-ఆర్డినేటర్ మహేష్ తదితరులు మహాసభలు
జయప్రదం కావాలని సందేశాలు ఇచ్చారు.
ఆహ్వాన సంఘం కార్యదర్శి వేణు సభలు జయప్రదం చేయడానికి సహకరించిన ఖమ్మం ప్రజలకు విప్లవ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు.శుభాకాంక్షలుతెలిపారు.రైతులు,వ్యవసాయకార్మికులు,ఆదివాసీలు, కార్మికులు,మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య పోరాటాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వారు తమ సందేశాల్లో పేర్కొన్నారు.కార్పొరేట్ దోపిడీ, భూస్వామ్య ఆధిపత్యం,నిర్వాసితత్వం, కుల వివక్ష,మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల ఐక్యతను మరింత విస్తృతం చేయాలనిపిలుపునిచ్చారు.ఈ సభలో ఏఐకెఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి. డాక్టర్ అసిస్ మిట్టల్ఉపాధ్యక్షులు సుశాంత్ ఝా,జే.వి.చలపతి రావు గారు,శంభు ప్రసాద్ రామేందర్ సింగ్ బాలచంద్ర సడంగి మండల వెంకన్న బిక్షపతి సుధాకర్ చిట్టి పాటి ఆకుల.పాపయ్య,వేల్పూర్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు

























