నడిపల్లిలో పౌర హక్కుల దినోత్సవం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం నడి పల్లి గ్రామం లో ఎస్సీ,ఎస్టీల సంక్షేమ పథకాలపై డిచ్ పల్లి తాసిల్దార్ సతీష్ రెడ్డి అవగాహనకల్పించారు.సివిల్ రైట్స్ డే (పౌర హక్కుల దినోత్సవం) కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సీ,ఎస్టీ వర్గాల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,వాటి ద్వారాలభించేప్రయోజనాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ,ఎస్టీవర్గాలఅభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి అధికారులు వివరించారు. అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగంచేసుకోవాలని సూచించారు.పౌరహక్కులపరిరక్షణ,సామాజిక సమానత్వం,వివక్షకు తావులేని సమాజ నిర్మాణం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు. ఈసందర్భంగాకార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని పౌరహక్కులు,ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పొందారు.ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి తహసీల్దార్.సతీష్ రెడ్డి,నడిపల్లి సర్పంచ్. కులాచారి.అశ్విని,డిచ్ పల్లి ఎస్‌ఐ.ఆరిఫ్,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్.శ్రీనివాస్, సంతోష్,ప్రభు,రవి తదితర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.























