తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు…
తెలంగాణలో విద్యుత్ వినియోగదారులపై రూ.5,420 కోట్ల భారం పడనుంది. నవంబర్ కరెంట్ బిల్లుల నుంచే ట్రూఅప్ ఛార్జీల వసూళ్లు ప్రారంభం కానున్నాయి. తొలి నెల యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాత 50 పైసలు పెంచారు. ఈ పెంపుతో సామాన్యులపై ఆర్థిక భారం మరింత పెరగనుంది.























