ఘనంగా బీడీఎస్‌ఎస్ అమ్మవారి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు.
తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు.. దాండియా, కోలాటాలతో సందడి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి: పట్టణంలోని భారత్ రోడ్డులో కొలువుదీరిన బీడీఎస్‌ఎస్ అమ్మవారి 25వ వార్షికోత్సవం (సిల్వర్ జూబ్లీ) ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
అమ్మవారికి కుంకుమార్చనలు, వివిధ రకాల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా దాండియా, కోలాటాలు, ఆటపాటలతో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. తొమ్మిది రోజు
ల పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్న ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు.

























