60 వేల మంది రైతులతో కన్నెపల్లి పంప్‌హౌస్ గేట్లు తెరుస్తాం: KTR…
Jul 06, 2026, తెలంగాణ : కేసీఆర్‌పై కక్షతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం పంప్‌హౌస్‌లు ప్రారంభించకపోతే కన్నెపల్లి ముట్టడి చేస్తామని ప్రకటించారు. 60 వేల మంది రైతులతో గేట్లు తెరుస్తామని హెచ్చరించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన సందర్భంగా అడుగడుగునా అడ్డుకున్న ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.























