భీమ్‌గల్‌లో గంజాయి విక్రేత అరెస్ట్.. 116 గ్రాముల గంజాయి స్వాధీనం…
ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లలో విక్రయం.. నిందితుడిని రిమాండ్‌కు తరలించిన అబ్కారీ పోలీసులు
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలోని నందిగల్లీలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అబ్కారీ సీఐ వేణు మాధవ్ తెలిపారు.
గురువారం అబ్కారీ పోలీసులు నందిగల్లీలోని ఓ ఇంటిపై దాడి నిర్వహించగా, నిందితుడు మేడే లక్ష్మయ్య (ఎస్/ఓ మేడే చిన్నా), సోమన్పల్లి గ్రామం, మాడెడ్ మండలం, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి వద్ద నుంచి 116 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకొచ్చి, ఒక్కో చిన్న ప్యాకెట్‌ను రూ.500 చొప్పున విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న అతను తరచూ గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. అతనితో కలిసి నివసిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులను భీమ్‌గల్ తహసీల్దార్ (ఎంఆర్వో) ముందు హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు వెల్లడించారు.
ఈ దాడిలో ఎస్సై గోవర్ధన్, హెడ్ కానిస్టేబుల్ వహీద్, కానిస్టేబుళ్లు సాయన్న, దేవేందర్ పాల్గొన్నారు.

























