నూతన ఇరిగేషన్ ఎస్ఈ గుణవంత్‌రావు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డిని కలిశారు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా ఇరిగేషన్ శాఖ నూతన సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్ఈ)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గుణవంత్‌రావు గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో గుణవంత్‌రావు పుష్పగుచ్ఛం అందజేసి తనను తాను పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్‌కు సంబంధించిన పలు అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగునీటి వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి సూచించారు. కొత్త బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఎస్ఈ గుణవంత్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు.

























