భీమ్‌గల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కారు బోల్తా.. స్వల్ప గాయాలతో సురక్షితం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్‌గల్, జూలై 14: భీమ్‌గల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ బొదిరే నాగమణి ప్రయాణిస్తున్న కారు సోమవారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు.
ఆర్మూర్ నుంచి భీమ్‌గల్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి బోల్తా పడినా, అందులోని ఎయిర్‌బ్యాగులు వెంటనే తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో ఛైర్‌పర్సన్ నాగమణితో పాటు ఆమె భర్త స్వామి, కుమారుడు, కుమార్తె స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం భీమ్‌గల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు ఘటనపై సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం.

























