భీంగల్ అర్ధరాత్రి ఘర్షణ.. బీఆర్ఎస్ కార్యకర్తపై మూకుమ్మడి దాడి!
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సాగర్‌పై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో సాగర్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఘర్షణకు దారితీసిన అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. పాత కక్షలా? లేక రాజకీయ కారణాలా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

























