Homeతెలంగాణపాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై త్వరలో శుభవార్త: సీఎం రేవంత్ రెడ్డి!

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై త్వరలో శుభవార్త: సీఎం రేవంత్ రెడ్డి!

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై త్వరలో శుభవార్త: సీఎం రేవంత్ రెడ్డి!

మహబూబ్‌నగర్‌లో అమర రాజా కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభం

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి త్వరలోనే శుభవార్త వినిపిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 90 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి అనుమతులు సాధించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అలాగే డిండి ప్రాజెక్టుకు 30 టీఎంసీల నీటి కేటాయింపుపై కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు.

మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గిగా కారిడార్‌లో ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (CQP) తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

కృష్ణా పరివాహక ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న డిండి, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు పొరుగు రాష్ట్రంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతులు సాధించి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడం తన బాధ్యత అని స్పష్టం చేశారు.

“ఢిల్లీలో ఉన్నా నేను పాలమూరు బిడ్డనే. ఈ వెనుకబడిన జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాను” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

విద్య, నీటిపారుదల, పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. పాలమూరులో ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్ కళాశాలలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రతి నియోజకవర్గానికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs) ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ రైజింగ్–2047 విజన్ అమలు చేస్తున్నామని, టూరిజం, ఎనర్జీ, మెడికల్, స్పోర్ట్స్ రంగాలకు ప్రత్యేక విధానాలు తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలకు అమర రాజా సంస్థ భాగస్వామిగా నిలవాలని కోరారు.

పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని గుర్తుంచుకోవాలని, స్థానిక యువతకు ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అమర రాజా యాజమాన్యాన్ని కోరారు.

వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈవీ రంగంలో బ్యాటరీల ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో 32 గిగావాట్ గంటల (GWh) సామర్థ్యం కలిగిన యూనిట్‌ను అమర రాజా ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. సంస్థలో పనిచేస్తున్న 700 మంది ఉద్యోగుల్లో 400 మంది మహిళలు ఉండటం అభినందనీయమన్నారు.

చిత్తూరులో ప్రారంభమైన అమర రాజా సంస్థ నాలుగు దశాబ్దాల తర్వాత తెలంగాణలో, ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ పెట్టుబడులు పెట్టడం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం తెలిపారు. ప్రపంచ స్థాయి సంస్థలతో పోటీ పడుతున్న అమర రాజా, చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాల కంపెనీలతో పోటీపడే స్థాయికి ఎదిగిందని ప్రశంసించారు.

ప్రపంచ ఈవీ రంగంలో చైనా ఆధిపత్యం ఉన్నప్పటికీ, అలాంటి దేశంతో పోటీ పడే స్థాయిలో అమర రాజా ఎదగడం గొప్ప విషయమని, అలాంటి సంస్థలను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అమర రాజా గ్రూప్చైర్మన్ గల్లా జయదేవ్, ఎంపీ డీకే అరుణ, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!