భారత్ సరికొత్త అడుగు.. ‘విక్రమ్-1’ ప్రయోగంపై పవన్ పోస్ట్…
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ‘విక్రమ్-1’ రాకెట్ ‘మిషన్ ఆగమన్’ పేరుతో విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన రాకెట్ ఇది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు ఇది నిదర్శనమని, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్-స్పేస్ సంస్థల బృందాలను ఆయన అభినందించారు. ఈ విజయం యువతకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు.























