Homeడొంకేశ్వర్ మండల్డొంకేశ్వర్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం...

డొంకేశ్వర్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం…

కేసీఆర్ హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర

-అసెంబ్లీ ఆవరణలో జరిగిన దాడుల ఘటనలు రేకెత్తిస్తున్న అనుమానాలు

-కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఉంటే ఆయనే లక్ష్యంగా దాడి జరిగేది

రేవంత్ రెడ్డి ఒక రాజకీయ ఉగ్రవాది

-ఆయన క్రిమినల్ బుద్ధి తెలిసే బీ ఆర్ఎస్ నేతలు అప్రమత్తంగా ఉంటున్నారు

-కేటీఆర్, హరీష్ రావు లక్ష్యంగా దాడులు దీనికి సంకేతం

-సభలో ప్రశ్నించకుండా బీఆర్ఎస్ ను బెదిరిస్తున్న రేవంత్ సర్కార్

బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి పరాభవిస్తారా?

-ఇది గౌరవసభ కాదు కౌరవసభ, ఈ రోజు బ్లాక్ డే

-నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-ఆర్మూర్ నియోజకవర్గంలో ఆందోళనలకు దిగిన గులాబీ శ్రేణులు

-జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో డొంకేశ్వర్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్దం…

ఆర్మూర్ సెప్టెంబర్ 7:- తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని బీ ఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఆవరణలో వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు ఎలాంటి కారణం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జరిపించిన దాడుల ఘటనలు పలు అనుమానాలురేకెత్తిస్తున్నాయన్నారు. బీ ఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులకు నిరసనగా ఆర్మూర్ నియోజకవర్గం డొంకేశ్వర్ మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్దం చేసి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళన కార్య క్రమాలకు నేతృత్వం వహించిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వమే నేరపూరిత రాజకీయాలకు కేంద్ర బిందువు కావడం ప్రజాస్వామ్యానికి దుర్దినమని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఉంటే ఆయనే లక్ష్యంగా దాడి జరిగేదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ ఉగ్రవాది అని, ఆయన క్రిమినల్ బుద్ధి తెలిసుకాబట్టే బీ ఆర్ఎస్ నేతలు అప్రమత్తంగా ఉంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కేటీఆర్, హరీష్ రావులు లక్ష్యంగా ప్రభుత్వం జరిపించిన దాడులు దీనికి సంకేతమని ఆయన నిలదీశారు.

సభలో ప్రశ్నించకుండా బీఆర్ఎస్ ను రేవంత్ సర్కార్ బెదిరిస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు.

ఉద్యమ సమయంలో ఇలాంటి ఘటనలను తిప్పికొట్టిన చరిత్ర బీ ఆర్ఎస్ దని ఆయన గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ కామెడీ చర్యలను ఎదుర్కోవడం గులాబీ సైన్యానికి ఒక లెక్కా అని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి పరాభవిస్తారా? అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

ఇది గౌరవసభ కాదు కౌరవసభ, ఈ రోజు బ్లాక్ డే అని ఆయన అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు,సీనియర్ నాయకులు రాజారాం యాదవ్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ…

0
బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ.. ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ మేడం  ముదక్పల్లి... పి హెచ్స్సీ పరిధిలోని కానాపూర్ నందుగల బస్తి దావకానను ఆకస్మిక తనిఖీ చేశారు....

కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్…

0
కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి…

0
ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ముఖ్యమంత్రి...

ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం…

0
ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి సంబంధించి సర్పంచ్ కిరణ్‌ను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. కొన్ని...

టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…

0
కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన అడుగులు.. టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు... హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగుతుందని పార్టీ సీనియర్...

Translate »
error: Content is protected !!