జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి వితరణ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లా లో జక్రాన్ పల్లి మండలం తొర్లి కొండ గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,తొర్లికొండలో క్రీడాకారులకు సుమారు రూ.13,700 విలువైన వాలీబాల్ క్రీడా సామగ్రిని గ్రామానికి చెందిన బురుగు మహేందర్ గౌడ్ కుమార్తె బురుగు మధుమిత అందజేశారు.ఈ సందర్భంగా బురుగు మధుమిత మాట్లాడుతూ, పాఠశాల విద్యార్థులు రాష్ట్ర,జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరుస్తుండటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.ఇదే స్ఫూర్తితో మరింత మంది క్రీడాకారులనుతీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి, ముఖ్యంగా క్రీడారంగానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పాఠశాలప్రధానోపాధ్యాయులు, జక్రాన్‌పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ,”ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గ్రామానికి చెందిన దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్రీడా సామగ్రిని అందించడంఅభినందనీయమైన విషయం.క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం,జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయి. ఇటీవల మా పాఠశాల విద్యార్థులు రాష్ట్ర,జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావడం గర్వకారణం.ఇలాంటి సేవాభావంతో ముందుకు వస్తున్న దాతల సహకారం విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది. బురుగు.మధుమిత కి,వారి కుటుంబ సభ్యులకు పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఈ క్రీడా సామగ్రిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించిపాఠశాల,గ్రామం,జిల్లా,రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి.గంగా.మోహన్,ఉపాధ్యాయులు.సాయిలు,రామకృష్ణ,గంగాధర్,డాక్టర్.నరసింహారావు,మాలతి, కృష్ణ,గౌతమి,చందు తదితరులు పాల్గొన్నారు.























