చేయూత పథకాన్ని అర్హులైన వారు అప్లై చేసుకోగలరు – కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ పిలుపు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మరపల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోనగిరి భాస్కర్ , వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పాలేపు నర్సయ్య , లు మాట్లాడుతూ,, ప్రజా ప్రభుత్వం చేపట్టిన చేయూత పథకం లో భాగంగా అర్హులు అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలని అన్నారు.వితంతు ఒంటరి మహిళా కళ్ళు గీత పైలేరియా డయాలసిస్ వారు ఫించన్ కొరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి కి లేదా ఎంపీడీఓ కార్యలయంలో ఇవ్వగలరనీ కోరారు.అలాగే ఇల్లు లేని పేద వర్గాల వారికి ఇందిరమ్మ ఇళ్ల కొరకు అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు. గృహ జ్యోతి 200 లోపు యూనిట్లు ఉండే వాళ్లకు ఉచిత విద్యుత్ అప్లై చేసుకోవా లని అందరికి ప్రజా ప్రభుత్వం మంచిగా ప్రజలకు సేవ చేస్తోందని ఈ పథకం ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి బాల్కొండ ఇంచార్జి సునీల్ రెడ్డి గారికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.























