Homeతెలంగాణప్రైవేట్, కార్పొరేటు పాఠశాలల ఫీజులపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలి - పిడిఎస్ యు డిమాండ్...

ప్రైవేట్, కార్పొరేటు పాఠశాలల ఫీజులపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలి – పిడిఎస్ యు డిమాండ్…

ప్రైవేట్, కార్పొరేటు పాఠశాలల ఫీజులపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలి – పిడిఎస్ యు డిమాండ్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…

ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పిడిఎస్ యు ఆధ్వర్యంలో రాంపూర్, డిచ్పల్లి మండలం లో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు కర్క గణేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్ మాట్లాడుతూ,రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల వివరాలను తప్పనిసరిగా బహిరంగంగా ప్రదర్శించాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేయడం,పాఠశాల అధికారిక వెబ్సైట్లో ఉంచాలని అనేది స్వాగతించదగ్గ విషయమన్నారు .అయితే కేవలం ఫీజుల వివరాలను ప్రదర్శించడం మాత్రమే కాకుండా,ప్రతి తరగతికి ఎంత ఫీజు వసూలు చేయాలనే దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే స్పష్టమైన ఫీజుల పరిమితులను, వివరాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వం చేపట్టిన విధానాలను ఆదర్శంగా తీసుకుని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి తరగతికి సంబంధించిన ఫీజు వివరాలను ప్రభుత్వం ముందుగానే ప్రకటించి, వాటిని తప్పనిసరిగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రస్తుతం అనేక ప్రైవేట్ పాఠశాలలు ట్యూషన్ ఫీజు,అడ్మిషన్ ఫీజు, పుస్తకాలు, యూనిఫాం తదితర పేర్లతో తల్లిదండ్రులపై అదనపు ఆర్థికభారాన్ని మోపుతున్నాయన్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం సమగ్ర ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతి విద్యా సంవత్సరానికి ముందే తరగతి వారీగా ఫీజు పరిమితులను ప్రభుత్వం ప్రకటించి,అన్ని పాఠశాలలు అదే పరిమితుల్లో ఫీజులు వసూలు చేసేలా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించే పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలన్నారు.విద్య అనేది వ్యాపారం కాదని,ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించి,విద్యార్థుల హక్కులను కాపాడేందుకు ఫీజుల నియంత్రణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగాతీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు.ఎస్కే.అషూర్,ఎండి.నసీర్,జిల్లా సహాయ కార్యదర్శి అల్గోట్ సృజన్, జిల్లా నాయకులు మణితేజ,కార్తీక్,మున్నా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!