హుండీలు ఉండాల్సింది గుడిలో, మసీదులో, చర్చిలో మాత్రమే కాదు… బడుల్లో, ఆసుపత్రుల్లో కూడా ఉండాలి…
హుండీలు దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో ఉండటం సహజమే. అయితే అదే విధంగా మన సమాజంలో విద్య, వైద్యం కోసం కూడా సహాయ హుండీలు ఉండాలి.
డబ్బులు లేక ఏ ఒక్క విద్యార్థి చదువును మధ్యలో ఆపుకోకూడదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ కుటుంబం తమ పిల్లల చదువుకు దూరం కాకూడదు. అదేవిధంగా డబ్బులు లేక వైద్యం అందక ఏ ఒక్క ప్రాణం పోకూడదు.
మనలో ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం చేస్తే.. ఆ చిన్న సహాయం ఒక విద్యార్థి భవిష్యత్తును మార్చవచ్చు. ఒక కుటుంబానికి అండగా నిలవవచ్చు. ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు.
మన సంపాదనలో కొంత భాగాన్ని సమాజం కోసం కేటాయిద్దాం.
చదువుకు అండగా నిలుద్దాం.. వైద్యానికి సహాయం చేద్దాం..
మన వంతు మానవత్వాన్ని చాటుదాం.
– నాయిడి ప్రభాకర్

























