ఐడిసిఎంఎస్,పీపీసీసుద్దపల్లి వరి కోనుగోలు కేంద్రాన్నిప్రారంభించిన గ్రామ సర్పంచ్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి గ్రామం లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గ్రామసర్పంచ్. పానుగంటి.రూప సతీష్ రెడ్డి … దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు,సుద్దపల్లి సర్పంచ్.రూపా.సతీష్ రెడ్డి ఈ సందర్భంగా సర్పంచ్ రూపా.సతీష్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని అదేవిధంగా వరి ధాన్యం కొనుగోలు మొదలయ్యే రోజు నుండి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనేలా చర్యలు తీసుకోవాలని,పరుగు పేరు మీద రైతులను ఇబ్బంది పెట్టవద్దనితెలిపారు.అదేవిధంగా గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా చూడాలని లారీల కొరత లేకుండా చూడాలని ఈ సందర్భంగా సర్పంచ్ రూప.సతీష్ రెడ్డి తెలిపారు.రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిన ఏ గ్రేట్ రకం రేటు క్వింటాల్ కి 2461 బి గ్రేడ్ రకం 2444 రేటుతో పాటు 500 బోనస్ కల్పిస్తుంది కావున రైతులు ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే కొనుగోలు చేసుకోవాలని సర్పంచ్. రూపా.సతీష్ రెడ్డి తెలిపారు..ఈ యొక్క కార్యక్రమంలో ఉపసర్పంచ్.పిట్ల.క్రాంతి, కుమార్,వీడిసి అధ్యక్షులు. దుంపటి.భూమయ్య, క్యాషియర్.యాదగిరి లక్ష్మణ్,వీడీసీ సభ్యులు ఏరా.వినోద్ రెడ్డి,చింతం. లింగయ్య,నరేష్,పెద్ద సుబ్బయ్య, గంగాధర్,సాగర్,సెంటర్ సూపర్వైజర్ కె.సురేష్,సెంటర్ ఇంచార్జ్ వినోద్.రైతులు పాల్గొన్నారు.























