హోన్నా జీపేట్ లో శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని హోన్నాజీపేట్ గ్రామంలో ఎస్సై సందీప్ ‘మన ఊరు..మన బాధ్యత’ కార్య క్రమం నిర్వహించారు. శాంతిభద్రతల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. దేవి నవరాత్రి, విజయదశమి వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ శాఖ కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు























