పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ధర్పల్లి: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, గౌరవనీయులైన పోలీస్ కమిషనర్ (సీపీ) గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ధర్పల్లి గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ధర్పల్లి ఎస్సై జి. సందీప్, ఏఎస్ఐ, పోలీస్ సిబ్బంది, ధర్పల్లి గ్రామ సర్పంచ్ చెలిమల శ్రీనివాస్, వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు.

























