మాదకద్రవ్య రహిత యువతతోనే వికసిత భారత్ సాకారం – తె. యూ.రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం.యాదగిరి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
తెలంగాణవిశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–I ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ ఫై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమ ప్రారంభానికి ముందు విద్యార్థులచే డిచ్ పల్లి ఎస్ హెచ్ ఓ ఆరిఫ్ మారక ద్రవ్య రహిత సమాజం కోసం కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యం.యాదగిరి మాట్లాడుతూమాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను పరిరక్షించి, ఆరోగ్యవంతమైన సుశిక్షితమైన, బాధ్యతాయుతమైన యువ సమాజాన్ని నిర్మించడం ద్వారానే వికసిత భారత్ లక్ష్యాన్ని సాకారంచేసుకోగలమని ఉద్ఘాటించారు.దేశ ప్రగతికి యువశక్తి అత్యంత కీలకమని,యువతలో నైతిక విలువలు,సామాజిక స్పృహ,క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానాన్నిపెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా కుటుంబవ్యవస్థకు, సామాజిక శాంతికి,దేశ అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆయన వివరించారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉంటూవిద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, సమాజసేవలో తమసామర్థ్యాలను వినియోగించాలనివిద్యార్థులకు సూచించారు.జార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా విచ్చేసిన డిచ్‌పల్లి పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆరిఫ్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం,అక్రమ రవాణావల్ల ఉత్పన్నమవుతున్న సామాజిక, ఆరోగ్య, చట్టపరమైన సమస్యలను విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత మాదకద్రవ్యాల ప్రలోభాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాల నియంత్రణలో పోలీసు యంత్రాంగంతో పాటు విద్యాసంస్థలు,తల్లిదండ్రులు,పౌర సమాజం సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.మాదకద్రవ్యాలకుసంబంధించినఅనుమానాస్పద కార్యకలాపాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సామాజిక భద్రతకు తోడ్పడాలని సూచించారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో యువత చైతన్యవంతమైన భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అతిథిగా పాల్గొన్న విశ్వవిద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసంలో విద్యతో పాటు నైతిక విలువలు,సామాజిక బాధ్యత, క్రమశిక్షణకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందనిపేర్కొన్నారు.కార్యక్రమ నిర్వాహకులు, ఎన్ఎస్ఎస్ యూనిట్–I ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సీ.హెచ్.శ్రీనివాస్ మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వ నషా ముక్త్ భారత్ అభియాన్ స్ఫూర్తితో యువతలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంపొందించడం, సామాజిక బాధ్యతను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వివరించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–II ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హలీమ్ ఖాన్, యూనిట్–III ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్.స్వామిరావు,అధ్యాపకులు. డాక్టర్. రామలింగం, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్,డాక్టర్.నర్సయ్య,డాక్టర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉండాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.























