భీమ్‌గల్‌లో బీఆర్ఎస్ యువజన విభాగం మీడియా సమావేశం
కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్‌గల్ మండలంలో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుల తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అభివృద్ధి పనులను పక్కనబెట్టి రాజకీయ విమర్శలకే కాంగ్రెస్ నాయకులు పరిమితమవుతున్నారని విమర్శించారు.
భీమ్‌గల్ మండల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ నాయకులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
కాంగ్రెస్ నాయకులు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలను మానుకోవాలని సూచించారు. ప్రజల సంక్షేమం, మండల అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు నీలం రవి, గున్నాల భగత్, బోదిరే నర్సయ్య, రాము గౌడ్, దీపక్తో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

























