తులం బంగారం ఇవ్వకపోతే కాంగ్రెస్ నేతల మెడలోంచి తీసుకోండి” – ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
ప్రభుత్వ హామీలపై ఆర్మూర్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు…
ఆర్మూర్, జూలై 20: ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు తులం బంగారం ఇవ్వకపోతే, ఆ పార్టీ నాయకుల మెడలో ఉన్న బంగారాన్ని తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ విషయంలో ఎవరైనా పోలీసు కేసులు నమోదు చేస్తే తన వద్దకు రావాలని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వకపోతే, తాను సొంత ఖర్చులతో ఇళ్లు నిర్మించి ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ వాటాతో 3 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు రాకేష్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

























