భారీ వర్షాలకు కొండూరు కప్పల వాగు వంతెనకు ముప్పు.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని వినియోగించాలి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు గ్రామ సమీపంలోని కప్పల వాగు వంతెనకు నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. వంతెన దెబ్బతినే అవకాశం ఉన్నందున సిరికొండ, ధర్పల్లి మండలాల ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయంగా చిన్న వాల్గొట్ మీదుగా తమ గమ్యస్థానాలకు వెళ్లాలని కోరుతున్నారు. ప్రజలు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

























