Homeడిచ్ పల్లి మండల్సాంపల్లి సర్పంచ్ భర్తకు రూ.13,325 జరిమానా...

సాంపల్లి సర్పంచ్ భర్తకు రూ.13,325 జరిమానా…

సాంపల్లి సర్పంచ్ భర్తకు రూ.13,325 జరిమానా

టేకు చెట్ల తొలగింపు కేసులో అటవీశాఖ చర్యలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంసాంపల్లి గ్రామంలో టేకు చెట్ల తొలగింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అనుమతి లేకుండా టేకు చెట్లను తొలగించిన కేసులో సాంపల్లి సర్పంచ్ సంధ్య భర్త మాసూరి ప్రశాంత్‌కు అటవీశాఖ అధికారులు రూ.13,325 జరిమానా విధించినట్లు సమాచారం.

అసలేం జరిగింది?

సాంపల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం జేసీబీతో తవ్వకాలు చేపట్టిన సమయంలో, గ్రామానికి చెందిన అంతరెడ్డి నర్సయ్య తన ఇంటి పక్కన చాలా కాలంగా పెంచుకుంటున్న టేకు చెట్లను తొలగించారని ఆరోపించారు.

తనకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదా నోటీసులు ఇవ్వకుండానే సర్పంచ్ భర్త మాసూరి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర సమక్షంలో జేసీబీ సహాయంతో 12 టేకు చెట్లను తొలగించారని నర్సయ్య అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

డీఎఫ్‌వోకు ఫిర్యాదు

ఏళ్ల తరబడి పెంచుకున్న టేకు చెట్లను తొలగించడంతో నష్టపోయానని పేర్కొంటూ నర్సయ్య నేరుగా జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో)కు ఫిర్యాదు చేశారు. చెట్ల తొలగింపు విషయంలో తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఈ అంశంపై పంచాయతీ కార్యదర్శిని సంప్రదించినప్పటికీ సరైన వివరణ ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

వాల్టా చట్టం ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని నర్సయ్య కోరారు.

క్షేత్రస్థాయి విచారణ

డీఎఫ్‌వోకు ఫిర్యాదు అందడంతో ఇందల్వాయి ఎఫ్‌ఆర్‌వో రవి భట్ ఆదేశాల మేరకు అటవీశాఖ రేంజ్, బీట్ అధికారులు సాంపల్లి గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.

అనుమతి లేకుండా వ్యక్తిగతంగా పెంచుతున్న చెట్లను తొలగించడం నిబంధనలకు విరుద్ధమని నిర్ధారించిన అనంతరం సాంపల్లి సర్పంచ్ భర్త మాసూరి ప్రశాంత్‌కు రూ.13,325 జరిమానా విధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

అయితే ఈ వ్యవహారంలో పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర పాత్రపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది స్పష్టత రావాల్సి ఉంది.

ఆలస్యంపై బాధితుడి ఆరోపణ

చెట్ల తొలగింపు ఘటన జూలైలోనే జరిగినప్పటికీ, తాను అప్పుడే ఫిర్యాదు చేసినా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేశారని బాధితుడు నర్సయ్య ఆరోపించారు.

గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో చెట్ల తొలగింపునకు సంబంధిత శాఖల అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

అనుమతులు లేకుండా చెట్లను తొలగించిన వ్యవహారంలో అటవీశాఖ జరిమానా విధించడం ప్రస్తుతం సాంపల్లి గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…

0
ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి... నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ యార్డు గుమస్తా, దడువాయి,...

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి…

0
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి... నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.....

నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం…

0
నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ఓమన్నా పటేల్, మైనార్టీ మోర్చా...

25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…

0
25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పోతంగల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు...

హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు…

0
నిజామాబాద్‌లో నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేసినట్లుగా ఆమె సోదరుడు సంతోష్ స్వయంగా వీడియో విడుదల చేయడం...

Translate »
error: Content is protected !!