మట్టి వినాయకుడికి ఘనంగా తొలి పూజలు…
దేవి విహార్ ఫేజ్–2లో పర్యావరణహితంగా గణనాథుడి ప్రతిష్ఠాపన…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి పట్టణంలోని దేవి విహార్ ఫేజ్–2లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
తొలి రోజు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అద్భుతంగా తీర్చిదిద్దిన మట్టి వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.
పర్యావరణానికి హాని కలగకుండా మట్టి వినాయకులను పూజించాలని నిర్వాహకులు ప్రజలకు సూచించారు.
విగ్రహదాతలుగా మంచాల రాజేశ్వర్ , తోడు గణపతి దాత గొల్ల ప్రదీప్ యాదవ్ వ్యవహరించారు….
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అంబీర్ వెంకట్రావు, ఉపాధ్యక్షుడు సరికొండ ప్రభాకర్, గణేష్ మధు, ప్రధాన కార్యదర్శి పరశురాం గౌడ్, కోశాధికారి శ్రీనివాసాచారి పాల్గొన్నారు.
సలహాదారులు సుభాష్ గౌడ్, హనుమాన్లు, ప్రభాకర్, రాజారాం, జయరాం, వడ్ల బసవయ్య తదితరులు హాజరయ్యారు.
నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బల్ల మహేశ్, ప్రధాన కార్యదర్శి మనోహర్, కోశాధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పూర్వ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు.
భక్తుల సందడితో దేవి విహార్ ఫేజ్–2లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది….

























