ఇంజినీర్స్ డే సందర్భంగా ఏఈ మౌనికకు లయన్స్ క్లబ్ ఘన సన్మానం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
ఇంజినీర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్‌పల్లి ఆధ్వర్యంలో కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కమ్మర్‌పల్లి మండలంలో హౌసింగ్ శాఖ ఏఈగా విధులు నిర్వహిస్తున్న మౌనికను లయన్స్ క్లబ్ సభ్యులు శాలువా, మెమొంటోతో ఘనంగా సన్మానించారు.
ఇంజినీర్ల సేవలను కొనియాడుతూ, సమాజ అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకమని క్లబ్ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కమ్మర్‌పల్లి అధ్యక్షుడు తెడ్డు రమేష్, ప్రధాన కార్యదర్శి హైమద్, కోశాధికారి సుంకరి విజయ్ కుమార్, డిస్ట్రిక్ట్ చైర్మన్ లుక్కా గంగాధర్, ఉపాధ్యక్షుడు సున్నం మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రదీప్, కార్యవర్గ సభ్యులు పాలేపు నర్సయ్య,సర్పంచ్ రేవతి గంగాధర్,కనక గంగాధర్, చంద్రశేఖర్,లింగారెడ్డి, పవన్, రవీందర్, నర్సయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

























