Homeతెలంగాణభారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ జట్టుకు నిజామాబాద్ క్రీడాకారిణులు...

భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ జట్టుకు నిజామాబాద్ క్రీడాకారిణులు…

భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ జట్టుకు నిజామాబాద్ క్రీడాకారిణులు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్: భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ మహిళల జట్టుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు ఎంపికయ్యారు. సాంఘిక సంక్షేమ పాఠశాల, సుద్దపల్లికి చెందిన దయ్యాల లిఖిత, సాంఘిక సంక్షేమ పాఠశాల, ధర్మారంకు చెందిన ఈర్నాల వర్షిణి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.

మహారాష్ట్రలోని సంజీవని యూనివర్సిటీ, కోపర్‌గావ్‌లో జూలై 24, 25 తేదీల్లో నిర్వహించిన తొలి సెలెక్షన్ ట్రయల్స్‌లో డి. లిఖిత, ఈ. వర్షిణి అద్భుత ప్రతిభ కనబరిచి ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికయ్యారు. అనంతరం ఆగస్టు 24, 25 తేదీల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిర్వహించిన రెండో దశ సెలెక్షన్ ట్రయల్స్‌లోనూ తమ ప్రతిభను కొనసాగించి ప్రాబబుల్స్ జట్టులో స్థానం సంపాదించారు.

ఈ నెల 8 నుంచి 13 వరకు మహారాష్ట్రలోని సంజీవని యూనివర్సిటీ, కోపర్‌గావ్‌లో నిర్వహించిన తొలి శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారిణులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో భారత సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ మహిళల తుది జట్టుకు ఎంపికయ్యారని జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి. ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మార్కంటి గంగా మోహన్ తెలిపారు.

అక్టోబర్ 5 నుంచి 10 వరకు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో నిర్వహించనున్న తుది శిక్షణ శిబిరంలో లిఖిత, వర్షిణి పాల్గొంటారని తెలిపారు. అనంతరం అక్టోబర్ 12 నుంచి 18 వరకు చైనాలోని వెయిహైలో జరగనున్న సాఫ్ట్‌బాల్ సబ్-జూనియర్ మహిళల ఏషియా కప్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారని పేర్కొన్నారు.

భారత జట్టుకు ఎంపికైన జిల్లా క్రీడాకారిణులు దయ్యాల లిఖిత, ఈర్నాల వర్షిణిలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. జిల్లా క్రీడాకారిణులు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనుండటంపై అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో జిల్లాలోని మరింత మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ అందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేలా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బి. మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి కె. శోభన్ బాబు, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె. నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు అభిషేక్ గౌడ్, ఇండియా కోచ్ డాక్టర్ కృష్ణ క్రీడాకారిణులను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…

0
ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి... నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ యార్డు గుమస్తా, దడువాయి,...

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి…

0
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి... నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.....

నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం…

0
నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ఓమన్నా పటేల్, మైనార్టీ మోర్చా...

25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…

0
25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పోతంగల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు...

హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు…

0
నిజామాబాద్‌లో నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేసినట్లుగా ఆమె సోదరుడు సంతోష్ స్వయంగా వీడియో విడుదల చేయడం...

Translate »
error: Content is protected !!