Homeనిజామాబాద్ జిల్లా వార్తలుగోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి

గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్ ఫిబ్రవరి 24 : వచ్చే ఏడాది 2027 జూలై 23 నుండి ఆగస్టు 03వ తేదీ వరకు జరుగనున్న గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. పుష్కరాల కోసం చేపట్టాల్సిన పనులు, సదుపాయాలను గుర్తిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో మంగళవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ గోదావరి పుష్కర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్ బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉంటాయని, వీటితో పాటు అనువైన ప్రాంతాలలో మరిన్ని ఘాట్లను గుర్తించవచ్చని అన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గోదావరి నది తీరంలో సౌకర్యాల కల్పన దిశగా పుష్కర ఘాట్ల వద్ద వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్, భద్రత, రూట్ మ్యాప్ ఇతర ఏర్పాట్ల వివరాలను పరిశీలించి, ఆయా శాఖల వారీగా సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున అన్ని అంశాలను నిశితంగా పరిశీలన జరపాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఆర్టీసీ ఆర్.ఎం జ్యోత్స్న, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఘన్‌పూర్ రాజరాజేశ్వర చెరువులో మహిళ మృతదేహం కలకలం…

0
ఘన్‌పూర్ రాజరాజేశ్వర చెరువులో మహిళ మృతదేహం కలకలం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం: ఘన్‌పూర్ గ్రామంలోని రాజరాజేశ్వర చెరువులో ఓ వృద్ధ మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు...

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

Translate »
error: Content is protected !!